Meghalu Lekunna Song Lyrics in Telugu
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే
అది నీ అల్లరేనా..
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీ వల్లేనా
కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ..
మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచేప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ.. మన మద్య దారంకైన దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ.ఉ.ఓ..
Click here for the details of :